News April 14, 2025
ఘోరం: నిండు గర్భిణిని హత్య చేసిన భర్త

నిండు చూలాలైన భార్యను హత్య చేశాడో కిరాతక భర్త. వైజాగ్‌లోని పీఎంపాలెం పీఎస్ పరిధిలో ఉంటున్న జ్ఞానేశ్వర్, అనూషది ప్రేమపెళ్లి. గత కొన్ని రోజులుగా వారి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. నెలలు నిండిన భార్యను జ్ఞానేశ్వర్ ఈరోజు దారుణంగా గొంతునులిమి హత్య చేశాడు. ఆమెకు ఒంట్లో బాలేదని కుటుంబీకులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తరలించేసరికే అనూష మృతిచెందింది. జ్ఞానేశ్వర్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News April 16, 2025
పంచాయతీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

TG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేసే చిరు ఉద్యోగులకు మే నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి నెలనెలా జీతాలు అందనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఫైల్‌కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ప్రతినెలా వీరి జీతాల కోసం రూ.115కోట్లు కేటాయించనున్నారు. ఇకపై వారికి నెలనెలా వేతనాలు అందేలా ప్రత్యేక పోర్టర్ రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 92వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.
News April 16, 2025
TGలో రానున్న రెండ్రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే?

TG: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 2రోజుల పాటు పగటిపూట ఎండ, సాయంత్రం వర్షాలు పడే అవకాశాలున్నాయని IMD తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిలాల్లో వర్షాలు పడతాయంది. 40KM వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
News April 16, 2025
నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

AP: CM చంద్రబాబు ఇవాళ యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 20న చంద్రబాబు తన పుట్టినరోజు వేడుకలను అక్కడే జరుపుకోనున్నారు. చంద్రబాబు ఇవాళ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తారు. అక్కడి నుంచి ఆయన విదేశాలకు చేరుకుంటారు. తిరిగి ఈ నెల 22న ఢిల్లీకి చేరుకుని పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. CM వ్యక్తిగత పర్యటన కావడంతో ఏ దేశానికి వెళ్తున్నారనేదానిపై వివరాలు గోప్యంగా ఉంచారు.