News March 27, 2024

సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్?

image

లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ రేపటితో ముగియనున్న నేపథ్యంలో CBI ఆయన కస్టడీని కోరనున్నట్లు తెలుస్తోంది. రేపు కోర్టు విచారణ సందర్భంగా సీబీఐ ఈ మేరకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈనెల 21న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ ఈ కేసుపై విచారిస్తోంది. మరోవైపు తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ చేపడుతోంది.

Similar News

News March 10, 2026

కూతురికి బర్త్‌డే విషెస్.. అరుదైన ఫొటోలు షేర్ చేసిన చిరు

image

తన కుమార్తె సుష్మిత కొణిదెల పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన అరుదైన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. చిన్నప్పుడు ఊయలలో ఉన్నప్పటి నుంచి నేడు తండ్రి సినిమాకే నిర్మాతగా మారి పక్కన నిల్చున్న వరకు ఉన్న జర్నీని గుర్తుచేసుకున్నారు. ‘నా సినిమాలు చూసే స్థాయి నుంచి నాతో సినిమా తీసి బ్లాక్‌బస్టర్ ఇచ్చే స్థాయికి ఎదగడం తండ్రిగా మర్చిపోలేని అనుభూతి’ అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చారు.

News March 10, 2026

గడ్డి మందు పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

కలుపు నివారణకు పారాక్వాట్ డైక్లోరైడ్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పిచికారీ చేస్తున్నారు. ఈ మందు పొరపాటున గాలి ద్వారా శరీరంలోకి వెళ్తే లంగ్స్, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. తక్కువ సమయంలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణం సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే గడ్డి మందును పిచికారీ చేసేటప్పుడు రైతులు మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించాలి.

News March 10, 2026

కలుపు ముప్పు తగ్గాలంటే ఇలా చేయాలి

image

పంట వేసేందుకు పొలాన్ని 2 నుంచి 3 దఫాలుగా దున్నడం వల్ల తొలిదశలోనే కలుపు విత్తనాలు మెులిచి మున్ముందు కలుపు సమస్య అంతగా ఉండదు. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్స్, పంట వ్యర్థాలను, వరి గడ్డిని నేలపై చదునుగా పరచడం, అంతరకృషి వంటివి కలుపును తగ్గించి పంటకు, నేలకు మేలు చేస్తుందనే వాస్తవాన్ని రైతులు తెలుసుకోవాలి. కలుపు మందును వాడాల్సి వస్తే తప్పకుండా నిపుణులు సూచన మేరకే వాడాలి. వ్యాపారుల ప్రమేయం ఉండకపోవడం మంచిది.