News April 14, 2025

భారత ఆర్చరీ అసోసియేషన్ సభ్యులుగా MHBD జిల్లా వాసి శంకరయ్య

image

దేశంలో ఆర్చరీ అభివృద్ధి కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఎఐ) ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా వాసి పుట్ట శంకరయ్యను కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా నియమించింది. ఉమ్మడి జిల్లా ఆర్చరీ సంఘం అధ్యక్షులు సాదుల సారంగపాణి, డివైస్ సునీల్ రెడ్డి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణ ఫర్ బాబు, మానుకోట జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News July 6, 2025

సింహాచలం గిరి ప్రదక్షిణకు ట్రాఫిక్ ఆంక్షలు

image

గిరి ప్రదక్షిణ రూట్లో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు విశాఖ సీపీ శంఖ‌బ్రత బాగ్చి తెలిపారు. 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు నిర్దేశిత ప్రాంతాలను గుర్తించామన్నారు.

News July 6, 2025

భక్తుల కొంగు బంగారం.. కొమ్మాల

image

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. చుట్టూ పచ్చని పొలాలతో గుట్టపై ఈ దేవాలయం ఉంది. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఈ ఆలయంలో ప్రతియేటా హోలీ సందర్భంగా జాతర జరుగుతుంది. మిగతా రోజుల్లోనూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక్కడి రైతులు తొలి పంటను స్వామివారికి అందిస్తుంటారు.

News July 6, 2025

వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలలకు కొత్త భవనాలు

image

వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలల్లో అదనంగా నూతన భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. గీసుగొండ మండలం నందనాయక్ తండా, నర్సంపేట మండల బోజ్యానాయక్ తండా, చిన్న గురజాల, పార్శ్య నాయక్ తండా, స్వామి నాయక్ తండాల్లో ఏర్పాటు చేయనున్న నూతన భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సమావేశంలో డీఈవోను ఆదేశించారు.