News April 14, 2025

రక్తమోడిన రోడ్లు.. ఎనిమిది మంది మృతి

image

AP: కడప(D) ఒంటిమిట్ట(M) నడింపల్లి వద్ద బస్సు-బొలెరో ఢీకొన్న ఘటనలో జీపులోని ముగ్గురు, నెల్లూరు(D) రాపూరులోని తిక్కనవాటిక పార్కు వద్ద కారు ఢీకొట్టడంతో వడ్లు ఎండబెట్టుకుంటున్న ఇద్దరు రైతులు చనిపోయారు. TG జనగామ(D) రాఘవపూర్ వద్ద లారీని కారు ఢీకొట్టడంతో కారు డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు చనిపోయారు. అటు RR(D) దామరగిద్ద వద్ద కారు డోర్లు లాక్ పడటంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు.

Similar News

News April 16, 2025

కోనోకార్పస్ చెట్లను నరకొద్దు: శాస్త్రవేత్తలు

image

కోనోకార్పస్ చెట్లపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాటిని రక్షించాలంటూ ప్రముఖ శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. అపోహలు నమ్మి చెట్లను నరకొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ చెట్లు అత్యధిక ఆక్సిజన్ విడుదల చేస్తాయని YVU మాజీ VC ప్రొ.ఏఆర్ రెడ్డి తెలిపారు. తక్కువ నీరు, నిర్వహణ లేకుండానే ఈ మొక్కలు బతుకుతాయని, హైవేలపై విరివిగా నాటాలని సూచించారు. ఈ చెట్లు భూగర్భ జలాలను అత్యధికంగా తీసుకుంటాయనేది అవాస్తవమని చెప్పారు.

News April 16, 2025

చాహల్‌కు POTM.. ఆర్జే మహ్వాష్ పోస్ట్ వైరల్

image

కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. ఈ క్రమంలో చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టగా వైరల్‌గా మారింది. ‘వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్.. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల వీరుడు అనేందుకు ఇదే కారణం. అసామాన్యుడు’ అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరి డేటింగ్ నిజమేనంటూ కామెంట్లు పెడుతున్నారు.

News April 16, 2025

రాష్ట్రంలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు.

error: Content is protected !!