News April 14, 2025

నిర్మల్‌ జిల్లాలో యాక్సిడెంట్.. ఒకరు స్పాట్ డెడ్

image

భైంసా-పార్డి(బి) రోడ్డుపై కారు బోల్తా పడి ఒకరు స్పాట్లో మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు నిర్మల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇద్దరు కూడా ఫొటోగ్రాఫర్లుగా తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. కారు అదుపుతప్పి బోల్తా పడిందా.. లేదా ఇతర కారణాలతో జరిగిందా అని పోలీసులు పరిశీలిస్తున్నారు.

Similar News

News January 14, 2026

భోగి వేడుకల్లో చంద్రబాబు ఫ్యామిలీ

image

AP: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. హరిదాసుల భక్తి కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలను సీఎం వీక్షించారు. ఈ విషయాన్ని ఆయన కోడలు, మంత్రి లోకేశ్ భార్య బ్రాహ్మిణి Xలో పోస్ట్ చేశారు. మన సంప్రదాయాలు, సంస్కృతి మూలాలకు ఇది చిహ్నం అని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో నారా రోహిత్ ఫ్యామిలీ, బాలకృష్ణ భార్య వసుంధర తదితరులు పాల్గొన్నారు.

News January 14, 2026

త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే ఇలా చేయండి

image

పిల్లల్ని కనడం అనేది చాలా మంది మహిళల కల. దీని కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. విటమిన్ D, C స్థాయిలు సరిగా ఉండేలా చూసుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. 3 నెలల ముందునుంచి ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

News January 14, 2026

HYD: సిటీలోని జైళ్లు కూడా డిజిటల్ మయం!

image

సిటీలోని చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో పాత పద్ధతులకు కాలం చెల్లింది. అంతా టెక్నాలజీ హవానే. రూ.2.5 కోట్ల విలువైన డ్రోన్లు, కంప్యూటర్లు, వాకీటాకీలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘స్వాగతం’ పోర్టల్, ఈ-ఆఫీస్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ఈజీ అయిపోయింది. ఖైదీలు తమ కేసు స్టేటస్ చూసుకోవడానికి 52 కొత్త మెషిన్లు కూడా వచ్చేశాయి. టెక్ అప్‌గ్రేడ్‌తో తెలంగాణ జైళ్లు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి.