News April 14, 2025

గద్వాల: ‘జార్జిరెడ్డి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి’

image

PDSU వ్యవస్థాపకుడు జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అకేపోగు రాజు ఆధ్వర్యంలో జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు గంజిపేట రాజు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజు మాట్లాడుతూ.. జార్జిరెడ్డి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.

Similar News

News April 16, 2025

గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న 16వ ఆర్థిక సంఘం 

image

గన్నవరం విమానాశ్రయానికి పనగారియ నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం చేరుకుంది. రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈ బృందం పర్యటిస్తుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం వంటి కీలకమైన అంశాలపై ఫైనాన్స్ కమిషన్ టీమ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల భేటీ కానున్నారు.

News April 16, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!!

image

∆} వివిధ శాఖల అధికారులతో ఇన్‌ఛార్జి కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} వైరా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} నేలకొండపల్లిలో సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన

News April 16, 2025

ఖమ్మం: ముగిసిన టెన్త్ స్పాట్ వాల్యూయేషన్

image

ఖమ్మం జిల్లాలో 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో మంగళవారం ముగిసింది.115 మంది సీఈలు, 530 మంది ఏఈలు, 150 మంది స్పెషల్ అసిస్టెంట్స్ విధులు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన మూల్యాంకనం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ పర్యవేక్షించారు. కాగా స్పాట్ వేల్యూషన్కు హాజరు కాని 64 మంది ఉపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు పంపారు.

error: Content is protected !!