News April 14, 2025

VKB: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేదలకు వరం: స్పీకర్

image

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదల పెళ్లిళ్లకు వరంగా మారాయని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News April 16, 2025

HYD: ఇంటికి స్వచ్ఛ ఆటో రాలేదా..? ఫిర్యాదు చేయండి!

image

HYD నగరవ్యాప్తంగా స్వచ్ఛ ఆటో ప్రతి ఒక్కరి ఇంటి వద్దకు వచ్చి చెత్త సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్, నాచారం, మల్లాపూర్ సహా అనేక ప్రాంతాల్లో గల్లీలో డే బై డే స్వచ్ఛ ఆటోలు వస్తున్నాయి. అయితే మీ ప్రాంతానికి ఒకవేళ స్వచ్ఛ ఆటో రాకపోతే 040-21111111కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

News April 16, 2025

ఖమ్మం: రేపు మహిళలకు జాబ్ మేళా..!

image

ఖమ్మం గాంధీ చౌక్‌లోని రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం నందు ఈనెల 17న ఉదయం 10 గంటలకు మహిళలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 30-45 సంవత్సరాల వయస్సు కలిగి, డిగ్రీ పాసైన మహిళలు అర్హులని పేర్కొన్నారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 16, 2025

HYDలో గంటకు 200 కేసులు

image

10, 20 కాదు గంటకు 200 కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడో కాదు HYDలో. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రాంగ్ రూట్లో వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల్లో 4,32,824 రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. HYDలో 1,62,000 కేసులు, రాచకొండలో 53,824, సైబరాబాద్‌లో 2,17,000 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి.

error: Content is protected !!