News April 14, 2025
IPL: టాస్ గెలిచిన చెన్నై

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు లక్నోలో CSKతో LSG తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో CSK కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. తెలుగు ప్లేయర్ రషీద్ CSKలో ఈరోజు ఆడనున్నారు.
CSK: రచిన్, రషీద్, త్రిపాఠీ, విజయ్ శంకర్, ఓవర్టన్, జడేజా, ధోనీ, నూర్, కాంబోజ్, ఖలీల్, పతిరణ
LSG: మార్ష్, మార్క్రమ్, పంత్, పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దూల్, ఆకాశ్, దిగ్వేశ్, ఆవేశ్
Similar News
News April 16, 2025
చాహల్‌కు POTM.. ఆర్జే మహ్వాష్ పోస్ట్ వైరల్

కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. ఈ క్రమంలో చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టగా వైరల్‌గా మారింది. ‘వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్.. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల వీరుడు అనేందుకు ఇదే కారణం. అసామాన్యుడు’ అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరి డేటింగ్ నిజమేనంటూ కామెంట్లు పెడుతున్నారు.
News April 16, 2025
రాష్ట్రంలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు.
News April 16, 2025
మార్నింగ్ న్యూస్ రౌండప్

☛ తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 12 గంటల సమయం
☛ నేడు యూరప్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు
☛ TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి శ్రవణ్ రావు విచారణ
☛ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ రేపు ఈడీ ఆఫీసు వద్ద ధర్నా: టీపీసీసీ చీఫ్
☛ అఫ్గానిస్థాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు