News April 14, 2025

విశాఖ: వైసీపీకి బెహరా రాజీనామా

image

విశాఖలో YCPకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నాయకుడైన బెహరా భాస్కర్ రావు రాజీనామా చేశారు. ఆయన వైసీపీ హయాంలో GVMC కో-ఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. విశాఖ సౌత్ MLAవంశీకృష్ణ యాదవ్‌తో సోమవారం భేటీ అయిన నేపథ్యంలో జనసేనలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. YCPకార్పొరేటర్లుగా ఆయన భార్యతో పాటు కోడలు వరుసయ్యే ఆమె ఉన్నారు. మేయర్‌పై అవిశ్వాసం ముందు వారు నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది.

Similar News

News March 10, 2026

తెల్లవారుజామున కవిత అరెస్టు

image

ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితుల పక్షాన నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఖమ్మం అంబేడ్కర్‌ భవన్‌ వద్ద డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌తో కలిసి ఆమె దీక్షకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ వైపు తరలించారు. పోలీసులకు, బాధితులకు మధ్య తోపులాట జరగడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

News March 10, 2026

లిక్కర్ కేసులో A15కి ఊరట.. జోగి రమేశ్ సోదరులకు నిరాశ

image

విజయవాడ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో A15 నిందితుడిగా ఉన్న తాండ్ర రమేష్‌కు విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరుల బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ ఇచ్చేందుకు నిందితుల తరపు న్యాయవాది సమయం కోరడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 10, 2026

నల్గొండ: బర్డ్ ఫ్లూ భయం.. అధికారి క్లారిటీ

image

నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఆనవాళ్లు లేవని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు. జిల్లాలో కోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని, ఎక్కడా చనిపోయినట్లు ఫిర్యాదులు అందలేదని ఆయన తెలిపారు. ప్రజలు బర్డ్ ఫ్లూ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండి ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు.