News April 14, 2025

వనపర్తి: ‘నిరంతర పోరాట స్ఫూర్తి కామ్రేడ్ జార్జిరెడ్డి’

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం అణుభౌతిక శాస్త్రంలో బంగారు పతకం పొందిన మేధావి, విప్లవవాది జార్జిరెడ్డి 53వ వర్ధంతిని పురస్కరించుకొని వనపర్తి పీడీఎస్‌యూ కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు కె.పవన్ కుమార్ మాట్లాడుతూ.. విద్యా, సామాజిక రంగాల్లో అణచివేతలకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

ఫ్రెండ్ బైక్ ఢీకొని యువకుడి మృతి

image

స్నేహితుడి బర్త్ డే వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన కోవూరు(M) కాపవరం వద్ద బుధవారం జరిగింది. రెల్లిపేటకు చెందిన గణేశ్, ఆనంద్, హేమంత్ జష్షు బర్త్ డే వేడుకల తర్వాత రెండు బైకులపై వస్తుండగా, తమ స్నేహితుల కోసం వెనక్కి వెళ్లే క్రమంలో స్నేహితుల వాహనాన్నే ఢీకొట్టారు. దీంతో గణేశ్ మృతి చెందగా, ఆనంద్, హేమంత్, జష్షుకు గాయాలయ్యాయి.

News November 6, 2025

NLG: రిజిస్ట్రేషన్ చివరి తేదీ మరో 4 రోజులే

image

వికసిత భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వికసిత్ భారత్ ప్రోగ్రాం చైర్మన్, నల్గొండ ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ కోరారు. దేశాభివృద్ధిలో విద్యార్థుల సృజనాత్మకత సందేశాత్మక వీడియో రూపొందించి అసెంబ్లీ, పార్లమెంటులో మాట్లాడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. అందుకు ఈనెల 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

News November 6, 2025

తొర్రూర్: పోక్సో కేసు నమోదు

image

బాలికపై అత్యాచారయత్నం చేసినందుకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తొర్రూర్ ఎస్ఐ ఉపేందర్ తెలిపారు. బాధితురాలు తనపై అత్యాచారయత్నం జరిగిందని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో నిందితుడి తల్లి, తండ్రి, నానమ్మ ముగ్గురూ కలిసి తమపై దాడి చేసి కొట్టారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెల్లడించారు.