News April 14, 2025
ఏప్రిల్ 16న గుంటూరులో మిర్చి రైతుల నిరసన

పేరేచర్లలో మిర్చి సాగు చేసిన కౌలు రైతులు దిగుబడి తక్కువగా రావడంతో అధిక నష్టాలు భరిస్తున్నారు. మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. మద్దతు ధర ప్రకటించినా, కొనుగోలు ప్రక్రియ లేదు. రైతులు బోనస్ ఇవ్వాలని, రూ.15,000కి క్వింటాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 16న గుంటూరులో నిరసన నిర్వహించనున్నారు.
Similar News
News April 16, 2025
హెచ్‌ఎం పోస్టులకు సీనియారిటీ జాబితా విడుదల: DEO

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో HM పోస్టుల భర్తీ కోసం అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. ఉద్యోగోన్నతులు పొందాలనుకునే ఉపాధ్యాయులు ఈ జాబితాను deovgnt.blogspot.com వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చని DEO రేణుక తెలిపారు. జాబితాలో పొరపాట్లు గమనించిన వారు ఈనెల 20లోపు గుంటూరు DEO కార్యాలయానికి లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు తెలపాలన్నారు.
News April 16, 2025
గుంటూరు: కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రి.. అరెస్ట్

సొంత కూతురిపై లైంగిక దాడికి ఒడిగట్టిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులోకి తీసుకున్నారు. నిందితుడిని కొలకలూరు కాలువ కట్టవద్ద గుర్తించి, రూరల్ సీఐ ఉమేశ్ చంద్ర, ఎస్ఐ కట్టా ఆనంద్‌ల బృందం మంగళవారం అదుపులోకి తీసుకుంది. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
News April 15, 2025
గుంటూరు: 22 కేసుల్లో ముద్దాయి అరెస్ట్

2019 నుంచి గుంటూరు, నంద్యాల జిల్లాల్లో దారిదోపిడులు, దొంగతనాలు చేస్తున్న చెంచు హనుమంతును ఎట్టకేలకు నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సుగాలిమెట్ట సమీపంలోని జంబులమ్మ గుడివద్ద పట్టుకున్న సమయంలో అతని వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న హనుమంతుతో పాటు అతడి ముఠా సభ్యులపై 22 కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ వెల్లడించారు.