News April 14, 2025

తుని: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లప్రోలు మండలం మల్లవరం రైల్వే గేట్ వద్ద ట్రైను ఢీకొని వ్యక్తి (45) మృతి చెందాడని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై వివరాలు ప్రకారం..మృతుడు శరీరంపై ఎటువంటి దుస్తులు లేవని, కుడి చేయిపై పెద్ద సైజు టాటూ, స్టీల్ కడియం ధరించి ఉన్నాడన్నారు. మృతుడు వివరాలు తెలిస్తే తుని జీఆర్పీ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News March 5, 2026

మంచిర్యాల: ఈ అబ్బాయి కనిపిస్తే పోలీసులకు చెప్పండి

image

చెన్నూర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పెద్దపోలు నాగవర్దన్ బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. మహంకాళివాడకు చెందిన ఈ విద్యార్థి మిస్సింగ్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల పరిసరాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు.

News March 5, 2026

ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,742 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 10,305 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

News March 5, 2026

MDK: మహాత్ముడి విగ్రహాలకు అవమానం!

image

ఇటీవల మహాత్ముడి విగ్రహాలను అవమాన పరిచే సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం రాత్రి మెదక్‌ రాందాస్ చౌరస్తా వద్ద గాంధీ విగ్రహానికి పేడ పూయడంతో పాటు కన్ను ధ్వంసం చేశారు. అలాగే తూఫ్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని తాతపాపాన్ పల్లీలో గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గతంలో మిరుదొడ్డి మండలంలోని ఓ గ్రామంలో కూడా గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. దుండగులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.