News April 14, 2025

BREAKING: గద్వాల: యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాందేడ్ నుంచి పసుపు లోడ్‌తో కేరళకు వెళ్తున్న లారీ హైవే పక్కన ఆగింది. ఈ సమయంలో షాద్‌నగర్ నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హుస్సేన్, క్లీనర్ వీరయ్య మృతిచెందారు.

Similar News

News November 11, 2025

పంటలకు నష్టపరిహారం అందించండి: పాణ్యం ఎమ్మెల్యే

image

కర్నూలు జిల్లాకు విచ్చేసిన మంత్రి అచ్చెన్నాయుడుని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పాణ్యం నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. అంతేకాకుండా మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని ఆమె మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

News November 11, 2025

గంగుల సోదరుడి కుమారుడి పెళ్లి.. కలెక్టర్, CPకి INVITATION

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త గంగుల సుధాకర్ కుమారుడు గంగుల సాయి మనోజ్ వివాహం ఈనెల 13న జరగనుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంను వారివారి కార్యాలయాల్లో కలిసిన MLA వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహ వేడుకకు తప్పకుండా హాజరుకావలసిందిగా వారిని గంగుల కోరారు.

News November 11, 2025

నేడు మూడు చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన

image

అనకాపల్లి జిల్లాలో గల మూడు నియోజకవర్గాల్లో మంగళవారం ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎస్.నరసింహారావు తెలిపారు. సోమవారం మాకవరపాలెం మండలంలోని ఎరకన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నం నియోజకవర్గంలో గల ఎరకన్నపాలెం, నక్కపల్లి, పరవాడలో ఎంఎస్‌ఎంఈ పార్కులకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేయనున్నారు.