News April 14, 2025
మంత్రి పదవి కోసం పార్టీలోకి రాలేదు: వివేక్

TG: మంత్రి పదవి కోసం తాము కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు MLA ప్రేమ్‌సాగర్ చేసిన వ్యాఖ్యలపై MLA గడ్డం వివేక్ స్పందించారు. ‘ఘర్ వాపసీ అంటూ రాహుల్ గాంధీ ఆహ్వానిస్తే వచ్చాం. పలు స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించాం. బీజేపీలో ఉంటే కేంద్రమంత్రి పదవి వచ్చేది. మంత్రి పదవి అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఎవరో మాట్లాడితే మాకొచ్చే నష్టం లేదు. మా కుటుంబమే ఒక బ్రాండ్’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News April 16, 2025
రాష్ట్రంలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు.
News April 16, 2025
మార్నింగ్ న్యూస్ రౌండప్

☛ తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 12 గంటల సమయం
☛ నేడు యూరప్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు
☛ TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి శ్రవణ్ రావు విచారణ
☛ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ రేపు ఈడీ ఆఫీసు వద్ద ధర్నా: టీపీసీసీ చీఫ్
☛ అఫ్గానిస్థాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
News April 16, 2025
ఈ వయసులో నాకిలాంటి మ్యాచులు అవసరం లేదు: పాంటింగ్

KKRతో మ్యాచ్‌లో తన గుండె వేగం పెరిగిందని పంజాబ్ కోచ్ పాంటింగ్ తెలిపారు. 50 ఏళ్ల వయసులో తనకు ఇలాంటి మ్యాచులు చూడాల్సిన అవసరం లేదని సరదాగా అన్నారు. చాహల్ అద్భుత ప్రదర్శనను ప్రశంసించారు. బ్యాటింగ్ దారుణంగా ఉన్నా.. వికెట్లు త్వరగా పడగొట్టి అద్భుతం చేశారన్నారు. ఎన్నో మ్యాచులకు కోచ్‌గా చేసినా ఈ విజయం మాత్రం తనకు బెస్ట్ అని పేర్కొన్నారు. మ్యాచ్‌పై నమ్మకంగా ఎలా ఉండాలనేదానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు.