News April 14, 2025

ములకలచెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి 

image

ములకలచెరువు వద్ద కాసేపటి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటో-టాటాఏస్ వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్న ఈ ఘటనలో ఆటోలోని చిన్నప్ప(56) చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సత్యసాయి(D) ముదిగుబ్బ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు SI నరసింహుడు, CI లక్ష్మన్న వెల్లడించారు.

Similar News

News July 7, 2025

ఇవాళ టారిఫ్ లెటర్స్ పంపిస్తాం: ట్రంప్

image

వివిధ దేశాలకు తాము ఇవాళ మ.12 గంటలకు (9:30 PM IST) టారిఫ్ లెటర్స్ పంపనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. BRICS అమెరికన్ వ్యతిరేక విధానాలకు మద్దతు తెలిపే ఏ దేశానికైనా అదనంగా 10% సుంకం విధిస్తామని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపారు. ఈ కొత్త టారిఫ్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని US కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుత్నిక్ పేర్కొన్నారు.

News July 7, 2025

WGL: లోకల్‌ పంచాయితీ తెగేనా..!

image

స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబరు 30లోగా నిర్వహించాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే BC రిజర్వేషన్‌ 42% అమలు అంశం గ్రామాల్లో కాక పుట్టిస్తోంది. మరో నెలన్నర లోపల ఎన్నికలు వస్తాయంటూ ఉమ్మడి జిల్లాలోని 1,702 పంచాయతీలు, 775 MPTC, 75 ZPTCల స్థానాల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్ ఆమోదిస్తేనే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.

News July 7, 2025

మెదక్: కుంటుంబం చెంతకు తప్పిపోయిన బాలుడు

image

మెదక్ పట్టణానికి చెందిన <<16899428>>వాసిప్ హుస్సేన్<<>> మానసిక స్థితి సరిగ్గా లేక వారం రోజుల కింద తప్పిపోయాడు. Way2Newsలో వచ్చిన కథనంతో తప్పిపోయిన బాలుడు కుటుంబం చేంతకు చేరాడు. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌లో సంచరిస్తున్న బాలుడిని గ్రామస్థులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.