News April 14, 2025
బుకింగ్స్ వివాదం.. OYO ఫౌండర్‌పై కేసు నమోదు

OYO ఫౌండర్ రితేశ్ అగర్వాల్‌పై రాజస్థాన్‌లో కేసు నమోదైంది. తప్పుడు సమాచారంతో మోసం చేశారని జైపూర్‌కు చెందిన సంస్కార రిసార్ట్స్ యజమాని మాధవ్ జైన్ ఫిర్యాదు చేశారు. 2019లో ఓయోతో సంవత్సర కాలానికి ఒప్పందం చేసుకున్నామన్నారు. కానీ 2019-20, 2020-21లోనూ తమ రిసార్ట్స్ బుకింగ్స్ ఓయోలో చూపించారన్నారు. దీంతో రూ.2.66 కోట్ల GST బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు నోటీసులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News January 15, 2026
సంక్రాంతికి అరిసెలు ఎందుకు చేస్తారు?

సంక్రాంతి పంటల పండుగ కాబట్టి కొత్తగా చేతికి వచ్చిన బియ్యం, బెల్లం, నువ్వులSతో అరిసెలు చేస్తారు. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, శక్తిని, ఐరన్‌ను ఈ పదార్థాలు అందిస్తాయి. అరిసెలు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల, పండుగకు వచ్చే అతిథులకు, అత్తారింటికి వెళ్లే అల్లుళ్లకు వీటిని ప్రేమపూర్వకంగా ఇస్తుంటారు. సంప్రదాయం ప్రకారం శుభకార్యాలకు, పండుగలకు అరిసెను ఒక సంపూర్ణమైన, మంగళకరమైన పిండివంటగా భావిస్తారు.
News January 15, 2026
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఝార్ఖండ్‌లో ఉద్యోగాలు

<
News January 15, 2026
పండుగ వేళ ఖాతాల్లోకి డబ్బులు

AP: సంక్రాంతి వేళ ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో డబ్బులు జమవుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న DA, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవుల మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5.70లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని ఆర్థిక శాఖ చెబుతోంది. ఒక్కో ఉద్యోగికి రూ.70వేల నుంచి రూ.80వేల వరకు అకౌంట్లో పడుతున్నట్లు సమాచారం. పలువురు కాంట్రాక్టర్లకూ పెండింగ్ బిల్లులు రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.


