News March 27, 2024

శ్రీకాకుళం: EVMల భ‌ద్ర‌త‌ను స‌మీక్షించిన‌ క‌లెక్ట‌ర్‌

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ మనజీర్ జిలాని సమూన్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి బుధవారం త‌నిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా అక్క‌డి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. గోదాముల‌ను తెరిపించి, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఏర్పాటు చేసిన బ్లాకులను, ఈవీఎంల‌ను ప‌రిశీలించారు.

Similar News

News September 29, 2025

శ్రీకాకుళం జూనియర్ లెక్చరర్ సంఘ అధ్యక్షుడిగా మల్లేష్

image

శ్రీకాకుళం జిల్లా జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా డాక్టర్ హెచ్ మల్లేష్ ఎన్నికయ్యారు. ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించామని ఎన్నికల అధికారి నారాయణరావు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా బి వెంకట మోహన్, కార్యదర్శిగా రమేష్, జాయింట్ సెక్రటరీగా పెనుగుదురు ప్రసాదరావు ఎన్నికయ్యారని ఆయన వివరించారు. కార్యవర్గ సభ్యులను కూడా నియమించారు.

News September 28, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

★టెక్కలి: పాముకాటుకు రైతు మృతి
★కాశీబుగ్గ: బండి ముందుకెళ్తే.. గుంతలోకి చక్రం
★శ్రీకాకుళం: ఫోటోగ్రఫీ కళా ప్రదర్శన పోటీలకు ఆహ్వానం
★ టెక్కలి: లేడీస్ కార్నర్‌లో అగ్నిప్రమాదం
★ కంచిలి సంతలో ట్రాఫిక్ కష్టాలు
★ శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్‌కు 78వ ర్యాంకు
★ జిల్లాలో పలుచోట్ల వైసీపీ డిజిటల్ బుక్‌పై కార్యక్రమాలు
★ శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

News September 28, 2025

టెక్కలి: పాముకాటుకు రైతు మృతి

image

టెక్కలి మండలం బన్నువాడ గ్రామానికి చెందిన కూర్మారావు(65) అనే రైతు ఆదివారం సాయంత్రం పాముకాటుకు గురై మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోని పంట పొలంలో ఎరువులు చల్లుతున్న సమయంలో పాము కాటు వేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు హుటాహుటీన టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి సమీపంలో మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.