News April 15, 2025
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

సికింద్రాబాద్ స్టేషనులో అభివృద్ధి పనులు చేస్తున్న నేపథ్యంలో విజయవాడ నుంచి బయలుదేరే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ల రూట్‌ను నుంచి రైల్వే అధికారులు మార్చారు. మంగళవారం నుంచి నం.12713 BZA- SC రైలు సికింద్రాబాద్‌కు బదులుగా కాచిగూడ, నం.12714 SC- BZA రైలు కాచిగూడ నుంచి బయలుదేరుతుందన్నారు. నం.12713 మధ్యాహ్నం 12.55కి కాచిగూడ చేరుకుంటుందని, తిరిగి (నం.12714)సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
కాగజ్‌నగర్‌లో మళ్లీ పులి భయం

కాగజ్‌నగర్ డివిజన్‌లో మళ్లీ పులి భయం మొదలైంది. నవంబర్ నెలలోనే నలుగురు పులి దాడిలో మరణించారు. పులులు నవంబర్, డిసెంబర్ నెలల్లో తమ ఆవాసం, తోడు కోసం సంచరిస్తుంటాయి. తన ప్రయాణంలో ఎక్కడా స్థిరపడకుండా రోజుకు కనీసం 10 కిలోమీటర్లకు పైగా తిరుగుతాయి. నిలకడ లేని పులులు దాడులు చేసే అవకాశాలు ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పెంచికల్పేట్ మండలంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు.
News December 4, 2025
KMR: మరోసారి అవకాశం కల్పిస్తా ఈ సారికి ఆగు..!

పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత, రెండవ విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా మూడో విడత కొనసాగుతోంది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే వర్గానికి చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. మరోసారి నీకు అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు అన్నట్లు మాట్లాడుతున్నారు.
News December 4, 2025
అనుముల: ఇక్కడ నామినేషన్లు నిల్

అనుముల మండలం మొత్తం పంచాయతీ ఎన్నికల సందడిగా నెలకొనగా పేరూర్ గ్రామంలో అందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పేరూర్ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా గ్రామంలో ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళా ఓటరు ఒక్కరూ లేరు. రెండో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల చివరి రోజు వరకూ సర్పంచ్ స్థానానికి, వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.


