News March 27, 2024

చేనేతలకు 500 యూనిట్ల కరెంట్ ఫ్రీ: CBN

image

పుత్తూరు ప్రజాగళం సభలో చంద్రబాబు(CBN) కీలక ప్రకటన చేశారు. ‘నగరి ఎమ్మెల్యేగా పదేళ్లు ఉన్నా జబర్దస్త్ రోజా ఏం చేయలేదు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకున్నారు. గతంలో పవర్‌లూమ్ చేనేత కార్మికులకు విద్యుత్తు ఛార్జీలో సబ్సీడీ ఇచ్చి ఆదుకుంది మేమే. ఈసారి గెలిచిన వెంటనే 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తాం. నేటం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులకు బకాయిలు చెల్లిస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Similar News

News April 3, 2026

చిత్తూరు: గ్యాస్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

గ్యాస్ సిలిండర్ల సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్టు చిత్తూరు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. ఇప్పటివరకు 50 సమస్యలపై ఫిర్యాదులు రాగా.. ఏజెన్సీలతో చర్చించి 46 సమస్యలు పరిష్కరించామని చెప్పారు. గ్యాస్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ 08572-242734కు కాల్ చేయాలని సూచించారు. గుడిపాలలో గ్యాస్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామన్నారు.

News April 3, 2026

చిత్తూరు జిల్లాలో స్పెషల్ ఆఫీసర్ల నియామకం

image

సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 27 మండలాల్లో 621 పంచాయతీలు ఉన్నాయి. వీటికి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, జలవనరులు శాఖ ఏఈలు, డిప్యూటీ డీఈఈలు, ఎఫ్ఎవోలు, పశు, ఉద్యానశాఖ అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు.

News April 2, 2026

చిత్తూరు: హెల్మెట్ పెట్టుకుంటే బహుమతులు

image

చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు హెల్మెట్ పెట్టు- బహుమతి పట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా హెల్మెట్ పెట్టుకున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందించాలని నిర్ణయించారు. ముఖ్య ట్రాఫిక్ కూడళ్లలో పోలీసులు అందజేసే స్లిప్పులను పూర్తి చేసి వివరాలు నమోదు చేయాలి. వారాంత, నెలసరి బహుమతులు అందిస్తామని పేర్కొంటున్నారు. వాటితో పాట సర్టిఫికెట్లు, మెమెంటోలు అందిస్తామన్నారు.