News April 15, 2025
KMR: జిల్లా యువతకు ఉచిత శిక్షణ!

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సెట్విన్ శిక్షణ కేంద్రం యువజన సేవల విభాగం నిరుద్యోగ యువతకు ఉచిత వృత్తి, విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సెట్విన్ TTI తెలంగాణ ప్రభుత్వ కోఆర్డినేటర్ సయ్యద్ మోహిజుద్దీన్ తెలిపారు. DCA, PGDCA, టాలీ, ఫోటోషాప్, జావా, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, మెహందీ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు నం. 7386180456కు సంప్రదించాలని కోరారు.
Similar News
News December 27, 2025
WGL: కథా శివిర్కు 20 మంది విద్యార్థులు

దేశ యువతలో జాతీయత, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు గుజరాత్ ఉప్లేటా-ప్రాధా గ్రామంలో నిర్వహిస్తున్న 26వ రాష్ట్రీయ కథా శివిర్కు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల నుంచి విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. శివిర్ ఈ నెల 27 నుంచి జనవరి 4 వరకు కొనసాగనుంది.
News December 27, 2025
ఖమ్మం: ఇయర్ ఎండింగ్ ఎఫెక్ట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు

ఖమ్మం రవాణాశాఖ ఆఫీస్లో రోజుకు 50 నుంచి 60 వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కానీ గత ఐదు రోజులుగా ఈ రద్దీ సగానికి పైగా తగ్గింది. కొత్త సంవత్సరం, సంక్రాంతి సమయంలో వాహనాలు కొనవచ్చని చాలా మంది వేచి చూస్తుంటారు. అంతే కాకుండా వాహనాల షోరూంలు పలు ఆఫర్లు ప్రకటించి విక్రయాలు జరుపుతుంటాయి. దీంతో ఆ ప్రభావం రవాణా శాఖపై పడింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆర్డీవో ఆఫీస్, కేఎంసీ రహదారి ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోంది.
News December 27, 2025
వింటర్లో ఇలా చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది!

చలికాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు, ఇమ్యూనిటీ పెరిగేందుకు వైద్యులు కొన్ని సలహాలిస్తున్నారు. ‘లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగండి. ఉదయం కాసేపు ఎండలో ఉండండి. వాకింగ్ లేదా రన్నింగ్ చేయాలి. స్లో బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ప్రొటీన్+హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకోండి. కోల్డ్ వాటర్, ఖాళీ కడుపుతో కాఫీ తాగడం, లేవగానే హడావుడిగా పనులు చేయడం మానుకోండి’ అని చెబుతున్నారు.


