News April 15, 2025
మహారాజ్ బావోజీ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కొడంగల్‌లోని భూనీడ్ శ్రీ గురు లోక్ ప్రభు మహారాజ్ బావోజీ జాతర బ్రహ్మోత్సవాల్లో సోమవారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బావోజీ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం కొడంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 27న ఎల్కతుర్తి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలన్నారు.
Similar News
News December 5, 2025
ఖమ్మంలో సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి: ఎంపీ

వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న ఖమ్మంలో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణంలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి ఎంపీ రైల్వే సమస్యలపై వినతి పత్రం అందించారు. ఇరుముడి ధరించి, అయ్యప్ప సన్నిధానం శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఖమ్మంలో కేరళ ఎక్స్ ప్రెస్‌కు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని కోరారు.
News December 5, 2025
గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్‌ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.
News December 5, 2025
ASF: ఈ నెల 10 నుంచి సదరం శిబిరాలు

ASF జిల్లాలో ఈ నెల 10 నుంచి సదరం శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో దత్తారావ్ తెలిపారు. సదరం శిబిరాలకు వచ్చే వారు ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రాల్లో దివ్యాంగ పరీక్ష చేయించుకుని స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. ఆ తర్వాత నిర్ణీత తేదీల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగే శిబిరాలకు హాజరు కావాలని సూచించారు. ఈ నెల 10 నుంచి 31 వరకు శిబిరాలు ఉంటాయన్నారు.


