News April 15, 2025

పక్క పక్కనే షెడ్డులు ఉండటంతో ప్రాణనష్టం: ఎస్పీ

image

కైలాసపట్నం బాణసంచా కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్‌ను గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కోటవురట్ల పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. రెండవ నంబర్ షెడ్లలో పేలుడు జరిగి వ్యాపించిన మంటలు దగ్గరలో ఉన్న ఒకటో నంబర్ షెడ్‌కు వ్యాప్తి చెందినట్లు తెలిపారు. పక్క పక్కనే షెడ్‌లు ఉండటంవల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.

Similar News

News February 27, 2026

గ్రేటర్ వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు: కలెక్టర్

image

ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బస్సుల నిర్వహణకు అవసరమైన డిపో స్థలాన్ని త్వరగా అప్పగించాలని ఆదేశించారు. పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

News February 27, 2026

ఉత్తరాంధ్రకు భారీ ఫార్మా సంస్థ: లోకేశ్

image

AP: కూటమి పాలనలో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి లోకేశ్ తెలిపారు. రేపు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్కులో ప్రముఖ ఫార్మా సంస్థ ‘బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్’కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. రూ.2,300 కోట్ల పెట్టుబడితో 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. 2028-29 FYకు సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించనుందని వివరించారు.

News February 27, 2026

త్వరలో విజయవాడకు 100 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి సవిత

image

త్వరలో విజయవాడకు 100 సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నట్లు మంత్రి సవిత శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ బస్సులలో సైతం స్త్రీ శక్తి పథకం అమలు చేస్తామని, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా అత్యున్నత రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. పర్యావరణహితంగా, సరికొత్త హంగులతో సిద్ధమవుతున్న ఎలక్ట్రిక్ బస్సులు విజయవాడ వాసులకు అందుబాటులోకి రానున్నట్లు సవిత స్పష్టం చేశారు.