News April 15, 2025

ములుగు జిల్లాలో గుడుంబా కేసులెన్నో తెలుసా?

image

గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ములుగు ఎస్పీ శబరీశ్ అన్నారు. జిల్లాలో గత ఏడాది 2024లో గుడుంబా తయారీ, విక్రయ దారులపై 184 కేసులు నమోదు చేసి, 3023 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 216 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 10 వరకు 62 కేసులు నమోదు చేసి, 1426 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామన్నారు. 62 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News September 18, 2025

సాయిబాబా విగ్రహం పాలరాయితోనే ఎందుకు?

image

పాలరాయి ఆధ్యాత్మికంగా స్వచ్ఛతకు, బలానికి ప్రతీక. ఈ లక్షణాలు బాబా బోధనలకు అనుగుణంగా ఉంటాయి. పాలరాయి విగ్రహం ఉన్న చోట ప్రశాంతమైన, సామరస్య పూర్వక వాతావరణం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఇది సహజమైనది, ప్రాసెస్ చేయనిది కావడంతో పవిత్రంగా పూజా మందిరాల్లో ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అనేక ఆలయాల్లోనూ పాలరాయితో చేసిన సాయిబాబా విగ్రహాలే మనకు దర్శనమిస్తుంటాయి.

News September 18, 2025

నవ గ్రహాలు – భార్యల పేర్లు

image

సూర్యుడు – ఉష, ఛాయ
చంద్రుడు – రోహిణి
కుజుడు – శక్తి దేవి
బుధుడు – జ్ఞాన శక్తి దేవి
గురుడు – తారా దేవి
శుక్రుడు – సుకీర్తి దేవి
శని – జేష్ఠా దేవి
రాహువు – కరాళి దేవి
కేతువు – చిత్రాదేవి

News September 18, 2025

ఉస్మానియా ఆస్పత్రికి పూర్వ వైభవం ఎప్పుడో?

image

కేసీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియ ఆస్పత్రిని 2015లో పరిశీలించి దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఆస్పత్రికి త్వరలో నూతన భవన నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉస్మానియాకు పూర్వ వైభవం తెస్తామని ప్రకటించారు. అప్పటినుంచీ ఇప్పటి వరకు నాయకులు ప్రకటించడమే గానీ వైభవం తెచ్చేలా ఎవరూ పనిచేయడం లేదు. ఇలా ఉంది మన పాలకుల తీరని ప్రజలు చర్చించుకుంటున్నారు.