News April 15, 2025
NRPT: ‘ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి’

ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం నాలుగు అర్జీలు అందినట్లు చెప్పారు.
Similar News
News December 29, 2025
VKB: భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త

పరిగి RTC డిపో మేనేజర్ K.కృష్ణమూర్తి అరుణాచలగిరి ప్రదర్శన భక్తులకు శుభవార్త చెప్పారు. కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలగిరి ప్రదక్షణ, జోగులాంబ అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ప్యాకేజీతో సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టిక్కెట్ ధర ఒక్కొక్కరికి 3800/- నిర్ణయించారు. జనవరి 1న బయలుదేరి 4న తిరిగి చేరుతుందని వివరించారు.
News December 29, 2025
గిల్ చాలా బద్ధకస్తుడు.. కోహ్లీలా ఆడలేడు: పనేసర్

టీమ్‌ఇండియా వన్డే & టెస్ట్ కెప్టెన్ గిల్ చాలా బద్ధకస్తుడని, కోహ్లీలా దూకుడుగా ఆడలేడని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ విమర్శించారు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడం అతనికి భారమని అన్నారు. టెస్టుల్లో నిలదొక్కుకోవాలంటే దేశవాళీ క్రికెట్ బలోపేతం కావాలని సూచించారు. ప్లేయర్లు కేవలం IPL కాంట్రాక్టుల కోసమే ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కోహ్లీ లేకపోవడంతో జట్టులో ఆ తీవ్రత కనిపించడం లేదన్నారు.
News December 29, 2025
గద్వాల: కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యం..!

కన్నకూతురిపై తండ్రే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి తన 16 ఏళ్ల మైనర్ కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడి చేయడంతో ఆమె గర్భం దాల్చింది. బాధితురాలు నిందితుడి రెండో భార్య కుమార్తె కావటం గమనార్హం. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


