News April 15, 2025

ఏటూరునాగారం: వరి పంటను చూసి కన్నీరు పెట్టిన రైతులు

image

ఏటూరునాగారం మండల వ్యాప్తంగా ఆదివారం కురిసిన ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో వరిపంట నేల వాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన చిన్నదుర్గయ్య అనే రైతు అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టి వరి పంటను సాగు చేశాడని, ఆదివారం వడగళ్ల వర్షం కురవడంతో వరిపంట, వడ్లు రాలిపోయాయని కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 16, 2025

రణస్థలం: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

డెంకాడ (M) చొల్లంగిపేట జంక్షన్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రణస్థలం (M) NGRపురానికి చెందిన జగిలి రామప్పడు(54) మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామప్పడు తన భార్య మహాలక్ష్మితో కలిసి బైక్‌పై గజపతినగరం(M) గంగచోల్లపెంట గ్రామానికి వెళ్తున్నారు. చొల్లంగిపేట జంక్షన్‌‌కి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. ప్రమాదంలో రామప్పడు అక్కడికక్కడే మృతి చెందారు.

News April 16, 2025

యవ్వనంలోనే కీళ్లవాపును గుర్తించడమెలా?

image

వృద్ధాప్యంలో వచ్చే కీళ్లవాపు(ఆర్థరైటిస్)ను యవ్వనంలోనే గుర్తించొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాసేపు నడచిన లేదా పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకునే క్రమంలో కీళ్లలో నొప్పి రావడం, ఉదయం నిద్రలేచిన అరగంటకంటే ఎక్కువసేపు కండరాలు పట్టేసినట్లు ఉండటం, కీళ్ల చుట్టూ వాపు, తరచూ నీరసం, చేతుల్లో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు మున్ముందు రానున్న కీళ్లవాతానికి సూచనలని పేర్కొంటున్నారు.

News April 16, 2025

కాసేపట్లో వర్షం..

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి జల్లులు, గం.కు40KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. VKB జిల్లాల్లో మోస్తరు వర్షాలు, గం.కు40-61KM వేగంతో గాలులు వీస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. అటు 3 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

error: Content is protected !!