News April 15, 2025

వనపర్తి: పోక్సో యాక్ట్‌పై అవగాహన 

image

రాజ్యాంగం మనకు అనేక రకాలైన హక్కులను కల్పిస్తుందని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ ఉత్తరయ్య అన్నారు. వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని సూచన మేరకు సోమవారం వనపర్తి, పెద్దమందడి మండలాల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, మోటార్ వెహికల్ యాక్ట్‌పై ఆయన అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. 

Similar News

News April 16, 2025

‘నాగర్‌కర్నూల్ జిల్లాలో దరఖాస్తు గడువు పొడిగించాలి’

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువులు పొడిగించాలని సీపీఐ పట్టణ అధ్యక్షుడు కొత్త రామస్వామి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని కామ్రేడ్ లక్ష్మణ చారి భవన్‌లో సీపీఐ సమావేశం నిర్వహించారు. నిర్ణీత గడువు లోపల సెలవు దినాలు అధికంగా రావడంతో నిరుద్యోగులకు ఆటంకంగా మారిందని వారన్నారు. ప్రభుత్వం దరఖాస్తు గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు.

News April 16, 2025

‘రాజీవ్ యువ వికాసం’ నిరుద్యోగుల పాలిట గేమ్ ఛేంజర్: భట్టి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగుల పాలిట గేమ్ ఛేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బ్యాంకర్లు ముందుకు వస్తే యువత ఆర్థికంగా ఎదుగుతారని, రూ.6వేల కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశాలు ఉంటాయని తెలిపారు. కాగా ఈ పథకం దరఖాస్తు గడువు ఈ నెల 14తో ముగిసింది.

News April 16, 2025

నాగర్ కర్నూల్ జిల్లాకు రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు మంజూరు

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్, కల్వకుర్తి మున్సిపాలిటీలకు ప్రభుత్వం నూతన ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు బుధవారం మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పట్టణాల్లో రోజురోజుకు ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతుండడంతో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పాటుతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు కోరుతున్నారు. నూతన పోలీస్ స్టేషన్లు మంజూరవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!