News April 15, 2025

కురవి: GREAT.. ఇది కదా స్నేహమంటే

image

సంతోషంలోనే కాదు.. కష్టాల్లోనూ తోడుండే వారే నిజమైన స్నేహితులు అని అంటుంటారు. అలాంటి నానుడిని నిజం చేశారు ఆ స్నేహితులు. కురవి మండలం మోదుగుల గూడెం గ్రామానికి చెందిన గాడిపెళ్లి రమేశ్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న 1997-98 బ్యాచ్‌కి చెందిన రమేశ్ పదవతరగతి స్నేహితులు రూ.26 వేల ఆర్థిక సహాయాన్ని రమేశ్ కుటుంబానికి అందజేసి పరామర్శించారు.

Similar News

News November 7, 2025

NZB: ఈ నెల 8 నుంచి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు

image

తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి 9 వరకు సీనియర్ పురుషులు, మహిళల రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలను HYD సుల్తాన్ సాయి ప్లే గ్రౌండ్‌లో ఓపెన్ క్యాటగిరిలో నిర్వహిస్తామని NZB రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలన్నారు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ 9550358444కు సంప్రదించాలన్నారు.

News November 7, 2025

రథాల రామారెడ్డికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా!

image

కామారెడ్డి(D)లోని రామారెడ్డిని పూర్వం దోమకొండ సంస్థానాధీశుడు రామిరెడ్డి పాలించడం, ఆ ఊరిలో రామాలయం పేరు మీదుగా రామారెడ్డి అనే పేరు వచ్చింది. సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఒక రథం, రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఒక రథం, ఇసన్నపల్లి-రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయంలో ఒక రథం ఉన్నాయి. ఇలా రథాలు ఉన్నందున పూర్వ కాలం నుంచే రథాల రామారెడ్డిగా పూర్వీకులు పిలుస్తున్నారు.

News November 7, 2025

శ్రీకాకుళం: జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్

image

జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్ ప్రసాద్ గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు ఆయనను కలిసి అభినందించారు. వ్యవసాయ శాఖ సేవలు రైతులకు అందించడం లక్ష్యంగా పని చేస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేర్చడం, లాభసాటి వ్యవసాయ పద్ధతులు అమలు లక్ష్యంగా వివరించారు.