News April 15, 2025

రాజధాని పనులు ఊపందుకుంటున్నాయి: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతి పనులు ఊపందుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ‘రాజధానిలో ప్రస్తుతం 3 వేల మంది కార్మికులు, 500 యంత్రాలు పని చేస్తున్నాయి. ఈ నెలాఖరుకు 15 వేల మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం’ అని వెల్లడించారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు.

Similar News

News April 23, 2025

పహల్‌గామ్‌లో అనుమానాస్పద బైక్ గుర్తింపు

image

జమ్మూకశ్మీర్ పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటన విచారణలో భద్రతా బలగాలు పురోగతి సాధించాయి. పహల్‌గామ్ సమీపంలో నంబర్ ప్లేట్ లేని బైక్‌ను గుర్తించాయి. టెర్రరిస్టులు దీన్ని ఉపయోగించినట్లు అనుమానిస్తున్నాయి. బైక్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ఘటనా స్థలానికి ఇవాళ ఎన్ఐఏ బృందాలు చేరుకోనున్నాయి.

News April 23, 2025

చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్

image

IPLలో అత్యంత వేగంగా 130 ఇన్నింగ్స్‌ల్లోనే 5,000 పరుగులు చేసిన ప్లేయర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించారు. నిన్న LSGతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ(57*) చేయడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్(135Inns), విరాట్ కోహ్లీ(157Inns), డివిలియర్స్(161Inns), ధవన్(168Inns) ఉన్నారు.

News April 23, 2025

ఇవాళే పోలింగ్

image

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల MLC ఎన్నికల పోలింగ్ ఇవాళ జరగనుంది. ఉ.8 నుంచి సా.4 వరకు ఓటింగ్ కొనసాగనుంది. 81మంది కార్పొరేటర్లు, 31మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికలో MIM నుంచి మీర్జా రియాజ్, BJP నుంచి గౌతంరావు పోటీలో ఉన్నారు. MIMకు 50, BJPకి 24, BRSకు 24, INCకి 14 మంది ఓటర్లు ఉన్నారు. పోటీకి దూరంగా ఉన్న INC, BRS ఓట్లు ఎవరికి వేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఎల్లుండి కౌంటింగ్ జరుగుతుంది.

error: Content is protected !!