News April 15, 2025
ADB: కత్తులతో పోస్టులు పెడుతున్నారా.. జాగ్తత్త

సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసమో.. హైప్ కోసం కత్తులు పట్టుకొని వీడియోలు పెడుతున్నారా.. జాగ్రత్త. ఇలాంటి వాటిపై ADB పోలీసులు దృష్టి సారించారు. ఎంతటి వారైనా తమ నుంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నారు. బైక్‌పై నోట్లో కత్తి పెట్టుకొని వీడియోలు పోస్ట్ చేసిన బంగారిగూడకు చెందిన సలీంపై ఇప్పటికే కేసుపెట్టారు. ఇలాగే వ్యవహరించిన పలువురిపై చర్యలు తీసుకున్నారు. ప్రజలను ఇబ్బందిపెడితే ఉపేక్షించేది లేదంటున్నారు.
Similar News
News April 19, 2025
తనదైన మార్క్ చూపిస్తున్న ADB SP అఖిల్ మహాజన్

ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే, ఇల్లీగల్ దందాలు నిర్వహించే వారిపై ADB SP అఖిల్ మహాజన్ ప్రత్యేక దృష్టి సారించారు. సోషల్ మీడియాలో మరణాయుధాలతో పోస్టులు పెట్టిన సలీం, వెంకట్, నరేష్, కార్తీక్, సిద్ధూ, సాయి, ఇర్ఫాన్‌లపై కేసులు పెట్టారు. మహిళను వేధించిన వ్యక్తిని HYD నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేయించారు. పలు కేసుల్లో నిందితులు, రౌడీషీటర్లపై ఫోకస్ పెట్టడంతో వారు కూడా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు.
News April 19, 2025
ADB: మహిళ కడుపులో 3.5కిలోల గడ్డ.. అరుదైన చికిత్స

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గ్రామానికి ఓ మహిళ కడుపులో నుంచి ముడున్నర కిలోల ఫైబ్రాయిడ్ గడ్డను వైద్యులు తొలగించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు. మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. మహిళ కుటుంబీకులు వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు.
News April 19, 2025
ADB: అమ్మాయిని వేధించాడు.. అరెస్టయ్యాడు

సోషల్ మీడియా ద్వారా బోథ్ పట్టణానికి చెందిన ఒక అమ్మాయిని వేధించిన కేసులో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తికి చెందిన అలీమ్ బేగ్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు SI ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అతడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. నిందితుడిపై రెంజల్ పోలీస్ స్టేషన్‌లో ఇదివరకే నాలుగు కేసులు, రౌడీ షీట్ ఉన్నాయని తెలిపారు.