News April 15, 2025
ధోనీ మరో రికార్డ్.. POTM అవార్డ్ నూర్‌కు ఇవ్వాల్సిందన్న మహీ

LSGతో మ్యాచ్‌లో 11 బంతుల్లోనే 26 రన్స్ చేసిన ధోనీని POTM అవార్డ్ వరించింది. దీంతో IPL చరిత్రలో ఈ అవార్డ్ అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయర్(43yrs 281d)గా ఆయన నిలిచారు. గతంలో ఈ రికార్డ్ లెగ్ బ్రేక్ బౌలర్ ప్రవీణ్ తాంబే(43yrs 60d) పేరిట ఉండేది. మరోవైపు, ధోనీ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవార్డ్ ఎందుకు ఇచ్చారు? నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశారు’ అని అన్నారు. అతను 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చారు.
Similar News
News April 16, 2025
ALL TIME RECORD: రూ.లక్షకు చేరువలో గోల్డ్ రేట్

ఢిల్లీలో బంగారం ధర రూ.లక్షకు చేరువైంది. ఇవాళ సాయంత్రం రూ.1650 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఆల్‌టైం హైకి చేరి రూ.98,100గా నమోదైంది. US, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఇన్వెస్టర్లు బంగారంపైకి భారీగా పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ ధరకు అనుగుణంగా దేశీయంగా గోల్డ్ రేట్స్‌కు రెక్కలొచ్చాయి. అతిత్వరలోనే ఇది రూ.లక్షను తాకనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
News April 16, 2025
15 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్, బంగ్లా చర్చలు

పాక్, బంగ్లా మధ్య 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు రేపు ఢాకాలో భేటీ కానున్నారు. వాణిజ్య, భద్రతాపరమైన అంశాలపై వారు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగ్లాకు తమ ఎగుమతుల్ని పెంచే ఆలోచనలో పాక్ ఉంది. అఫ్గాన్, ఇరాన్ నుంచి కూడా ఉత్పత్తుల్ని పాక్ ద్వారా బంగ్లాకు చేరవేయాలని ఆ దేశం భావిస్తున్నట్లు సమాచారం.
News April 16, 2025
100రోజులు కాకముందే పెను విధ్వంసం: జో బైడెన్

వృద్ధాప్య అమెరికన్లకు కనీస ఆదాయం అందించే సోషల్ సెక్యూరిటీ ఏజెన్సీ నిధులను US ప్రభుత్వం తగ్గించిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. DOGE పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఫైరయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం 100రోజుల పాలన కాకముందే ప్రభుత్వం చరిత్రలో చూడని విధ్వంసం, నష్టం సృష్టించిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ప్రసంగించారు.