News April 15, 2025
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి: అనంతపురం కలెక్టర్

విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకంలో రుణాలు, ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లా పరిషత్‌లో ఉన్న డీపీఆర్‌సీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల, రుణాలు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
అనంత: ‘బాలుడి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు’

అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెట్టూరు మండలం తిప్పనపల్లి గ్రామంలో ఆస్తి తగాదాల వల్ల 2022లో బాలుడిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. సెట్టూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.70/2022 u/s 302 r/w 34 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడి హత్య కేసులో ముగ్గురికి (చిట్టప్ప, ఈరన్న, ముకుందప్ప) కఠిన జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
News March 13, 2026
భార్యను చంపిన హత్య కేసులో భర్త అరెస్ట్

పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట అటవీ ప్రాంతంలో భార్యను చంపిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రికి చెందిన శ్రీలేఖ ప్యాపిలి మండలం నల్లమేకలపల్లికి చెందిన సుధాకర్‌ను వివాహం చేసుకుంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో భక్త సుధాకర్ శ్రీలేఖను చున్నీతో మెడకు బిగించి హత్య చేసి పడివేశారన్నారు. సుధాకర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రామసుబ్బయ్య తెలిపారు.
News March 12, 2026
గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి: జేసీ

ఈనెల 14, 15వ తేదీల్లో నిర్వహించే గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. గురువారం టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో వెన్యూ, స్టాల్స్ సిద్ధం చేయడం, రోడ్ల ప్యాచ్ వర్క్, తాగునీరు, లైటింగ్, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, హెరిటేజ్ వాక్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.


