News April 15, 2025
ఐక్యరాజ్య సమితిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి

డా.BR అంబేడ్కర్ జయంతిని భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో నిర్వహించింది. UN ప్రధాన కార్యాలయం(న్యూయార్క్)లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ నాయకులు హాజరయ్యారు. భారత్ తరఫున కేంద్రమంత్రి రాందాస్ అథవాలే పాల్గొని అంబేడ్కర్ గొప్పతనాన్ని, ఆయన ఆశయ సాధనకు PM మోదీ చేస్తోన్న కృషిని వివరించారు. మరోవైపు అంబేడ్కర్ సేవలను కొనియాడుతూ న్యూయార్క్ నగరం APR 14ను డా.భీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్ దినోత్సవంగా ప్రకటించింది.
Similar News
News April 19, 2025
వేమన పద్యం

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసమునకు
తన్నులోను జూడ తమమెల్ల వీడును
విశ్వదాభిరామ వినుర వేమ.
భావం: ఉన్నచోటును విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూసుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది.
News April 19, 2025
ఆ హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చు: కూనంనేని

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చని MLA కూనంనేని సాంబ శివరావు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి డోలాయమానంలో ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎవరికీ రుపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు.
News April 19, 2025
ఇలా చేస్తే కోటీశ్వరులు కావొచ్చు!

పెట్టుబడుల కోసం చాలా మార్గాలున్నా, సిప్(SIP) అనేది దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మంచి స్టాక్స్‌ను సెలెక్ట్ చేసుకొని నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టగలిగితే 15 ఏళ్లలో కోటి లేదా అంతకుమించి జమ చేసుకోవచ్చని తెలుపుతున్నారు. అయితే, మార్కెట్ల ఒడిదొడుకులు వల్ల స్వల్ప కాలంలో రాబడి ఉండదని, కనీసం పదేళ్లు కొనసాగిస్తామనే వారే SIP స్టార్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.