News April 15, 2025

IPL: నేడు పంజాబ్, కోల్‌కతా మధ్య పోరు

image

IPLలో ఇవాళ PBKS, KKR తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ 33 మ్యాచులు జరగ్గా KKR 21, PBKS 12 మ్యాచుల్లో నెగ్గాయి. గత 4 సీజన్లలో అయితే చెరో 4 విజయాలు దక్కించుకున్నాయి. గాయంతో ఫెర్గూసన్ దూరమవడం PBKSకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఆ జట్టు మాక్స్‌వెల్ నుంచి మంచి నాక్ ఆశిస్తోంది. అటు బెస్ట్ AVG, ఎకానమీతో బౌలింగ్ చేస్తున్న KKR స్పిన్నర్లు పంజాబ్‌ బ్యాటర్లను కట్టడి చేసే అవకాశం ఉంది.

Similar News

News April 19, 2025

వేమన పద్యం

image

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసమునకు
తన్నులోను జూడ తమమెల్ల వీడును
విశ్వదాభిరామ వినుర వేమ.
భావం: ఉన్నచోటును విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూసుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది.

News April 19, 2025

ఆ హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చు: కూనంనేని

image

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చని MLA కూనంనేని సాంబ శివరావు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి డోలాయమానంలో ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎవరికీ రుపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు.

News April 19, 2025

ఇలా చేస్తే కోటీశ్వరులు కావొచ్చు!

image

పెట్టుబడుల కోసం చాలా మార్గాలున్నా, సిప్(SIP) అనేది దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మంచి స్టాక్స్‌ను సెలెక్ట్ చేసుకొని నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టగలిగితే 15 ఏళ్లలో కోటి లేదా అంతకుమించి జమ చేసుకోవచ్చని తెలుపుతున్నారు. అయితే, మార్కెట్ల ఒడిదొడుకులు వల్ల స్వల్ప కాలంలో రాబడి ఉండదని, కనీసం పదేళ్లు కొనసాగిస్తామనే వారే SIP స్టార్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.

error: Content is protected !!