News March 27, 2024
పెండింగ్‌లో ఉన్న ఫారంలను వేగంగా పరిష్కరించాలి: ముఖేశ్ కుమార్

పెండింగ్ లో ఉన్న ఫారం-7,8 లను వేగవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పాల్గొన్నారు.
Similar News
News March 28, 2026
భీమవరంలో భారీ తెరలపై ఐపీఎల్ సందడి

నేటి నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రజలు కుటుంబ సమేతంగా వీక్షించేలా భీమవరంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. క్రీడాభిమానుల కోరిక మేరకు ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
News March 28, 2026
మాతృ, శిశు మరణాల నిర్మూలనే లక్ష్యం: కలెక్టర్

జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. శనివారం భీమవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జనవరి నుంచి మార్చి 2026 వరకు నమోదైన మాతృ, శిశు మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ కమిటీ సభ్యులతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. “జన్మిస్తూ శిశువు మరణించకూడదు” అనే సంకల్పంతో అధికారులు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు.
News March 28, 2026
తీర ప్రాంతాల ప్రజలకు సౌకర్యవతంగా వంతెనలు

10 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న <<19499031>>వంతెనల <<>>అప్రోచ్‌లకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మోక్షం కల్పించింది. తీర ప్రాంత గ్రామాలను కలుపుతూ ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఈ వంతెనలు ఉంటాయి. అప్రోచ్‌ల నిర్మాణంలో వంతెల వద్ద ఉన్న ఆలయాలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు జరిగేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వంతెనల వినియోగంలోకి వస్తే భీమవరం పట్టణంలో ట్రాఫీక్ సమస్య కూడా తగ్గుతుంది. పలు రకాల ఉత్పత్తుల రవాణా సులభంగా సాగుతుంది.


