News April 15, 2025
వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసుల దాడి

ఏలూరు రామచంద్రరావు పేటలోని సెయింట్ థెరీసా చిన్నపిల్లల గేటు సందులో ఓ గృహంలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో రెండో పట్టణ సీఐ అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి దాడి చేశారు. ఆ గృహంలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకురాలని, నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఒక బాధితురాలని గుర్తించారు. ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు వేల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News September 17, 2025
చాకలి ఐలమ్మ స్ఫూర్తి యోధులు వీరే..!

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మరికొందరు పోరాట యోధులు ఆమె పోరాట శైలిని స్ఫూర్తిగా తీసుకొని సాయుధ పోరాటంలో ఉద్యమించి ప్రాణాలర్పించారు. వారే పాలకుర్తికి చెందిన జీడి సోమయ్య, చాకలి సోమయ్య, మామిండ్ల ఐలయ్య, ఆకుల వెంకటయ్య, కమ్మరి బ్రహ్మయ్య, చుక్కా సోమయ్య, జీడి బాలయ్య, జీడి కొమురయ్య, వీరమనేని రామచంద్రయ్య తదితరులు ఉన్నారు.
News September 17, 2025
దేశవ్యాప్తంగా 16చోట్ల NIA సోదాలు

AP: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో NIA మరోసారి తనిఖీలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, UP, ఝార్ఖండ్, బిహార్, ఢిల్లీ, మహారాష్ట్రలో మొత్తం 16చోట్ల సోదాలు చేసింది. ఏపీలో నిర్వహించిన సోదాల్లో డిజిటల్ పరికరాలు, నగదు, అనుమానాస్పద వస్తువులు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. జులై నెల VZMలో సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను NIA అరెస్టు చేయగా.. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.
News September 17, 2025
ASF: యువకుడి ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాలు.. ASF మండలం అంకుశాపూర్ కి చెందిన సుభాశ్ (32) అప్పుల బాధతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి జానకాపూర్ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.