News April 15, 2025
నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ

TG: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీజీ టెట్) దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000గా ఫీజు నిర్ణయించారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు వస్తే హెల్ప్‌డెస్క్(7093958881, 7093468882) ఈ నెల 15 నుంచి జులై 22 వరకు అందుబాటులో ఉంటుంది. టెట్ పరీక్షలు జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు.
Similar News
News April 19, 2025
పాన్ ఇండియా లెవల్లో దృశ్యం-3

మలయాళం సినిమాలు దృశ్యం, దృశ్యం-2 అన్ని భాషల్లో రీమేక్ అయి మంచి విజయాలు అందుకున్నాయి. దృశ్యం-3 తెరకెక్కించే పనుల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ బిజీగా ఉండగా, ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దృశ్యం-3ని రీమేక్ చేయకుండా, పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్ని భాషల్లో కలుపుకొని రూ.500 కోట్లు వసూలు చేయాలని హీరో మోహన్‌లాల్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.
News April 19, 2025
చిన్నస్వామిలో మారని RCB కథ!

IPL: PBKSపై ఓడిన RCB ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. హోంగ్రౌండ్లో 46 మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. గతంతో ఈ రికార్డ్ ఢిల్లీ పేరిట ఉండేది. ఆ జట్టు అరుణ్‌జైట్లీ స్టేడియంలో 45 మ్యాచులు ఓడింది. కాగా, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడం RCBకి తొలి నుంచీ మైనస్సే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో భారీ స్కోర్లు చేసినా డిఫెండ్ చేసుకోలేక చాలా మ్యాచ్‌లు ఓడిపోయిందని అంటున్నారు.
News April 19, 2025
వేమన పద్యం

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసమునకు
తన్నులోను జూడ తమమెల్ల వీడును
విశ్వదాభిరామ వినుర వేమ.
భావం: ఉన్నచోటును విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూసుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది.