News April 15, 2025
TCSలో 42వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు!

ఈ ఆర్థిక సంవత్సరంలో 42వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని టీసీఎస్ నిర్ణయించినట్లు సమాచారం. 2024-25 మాదిరిగానే రిక్రూట్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది. నేషనల్ క్వాలిఫయర్ టెస్టులో ప్రతిభ చూపిన వారిని ప్రైమ్, డిజిటల్, నింజా విభాగాల్లో నియమించుకోనుంది. కాగా FY2024-25 చివరికి 6,07,979 మంది ఉద్యోగులు TCSలో ఉన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6,433 మంది మాత్రమే పెరిగారు.
Similar News
News April 19, 2025
30 ఏళ్లు దాటిన మహిళలకు అలర్ట్!

మహిళల ఆరోగ్యం పాడైతే ఇల్లు అనే బండి సాఫీగా కదలదు. ముఖ్యంగా ఇంటి పనులతో పాటు జాబ్ చేసే ఆడవారికి 30 ఏళ్లు దాటితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వారంతా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష(HPV), రొమ్ము క్యాన్సర్ టెస్ట్, బ్లడ్ షుగర్‌తో పాటు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఏదైనా జబ్బు బయటపడితే తొందరగా నయం చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
News April 19, 2025
పాన్ ఇండియా లెవల్‌లో దృశ్యం-3

మలయాళం సినిమాలు దృశ్యం, దృశ్యం-2 అన్ని భాషల్లో రీమేక్ అయి మంచి విజయాలు అందుకున్నాయి. దృశ్యం-3 తెరకెక్కించే పనుల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ బిజీగా ఉండగా, ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దృశ్యం-3ని రీమేక్ చేయకుండా, పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్ని భాషల్లో కలుపుకొని రూ.500 కోట్లు వసూలు చేయాలని హీరో మోహన్‌లాల్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.
News April 19, 2025
చిన్నస్వామిలో మారని RCB కథ!

IPL: PBKSపై ఓడిన RCB ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. హోంగ్రౌండ్‌లో 46 మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. గతంతో ఈ రికార్డ్ ఢిల్లీ పేరిట ఉండేది. ఆ జట్టు అరుణ్‌జైట్లీ స్టేడియంలో 45 మ్యాచులు ఓడింది. కాగా, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడం RCBకి తొలి నుంచీ మైనస్సే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో భారీ స్కోర్లు చేసినా డిఫెండ్ చేసుకోలేక చాలా మ్యాచ్‌లు ఓడిపోయిందని అంటున్నారు.