News April 15, 2025
రజతోత్సవ సభతో వరంగల్‌లో BRS ఊపందుకోనుందా?

ఈనెల 27న WGL జిల్లాలో BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 BRS కైవసం చేసుకోగా.. ములుగు, BHPL కాంగ్రెస్ గెలిచింది. 2023లో అది కాస్తా తారుమారుగా జనగామ, స్టే.ఘ మాత్రమే BRS గెలిచి.. మిగతావన్నీ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు BHPL MLA కాంగ్రెస్ నుంచి BRSలో, ఇప్పుడు స్టే.ఘ MLA BRS నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సభతో జిల్లాలో మల్లీ BRS ఊపందుకోనుందా?
Similar News
News April 19, 2025
పాన్ ఇండియా లెవల్‌లో దృశ్యం-3

మలయాళం సినిమాలు దృశ్యం, దృశ్యం-2 అన్ని భాషల్లో రీమేక్ అయి మంచి విజయాలు అందుకున్నాయి. దృశ్యం-3 తెరకెక్కించే పనుల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ బిజీగా ఉండగా, ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దృశ్యం-3ని రీమేక్ చేయకుండా, పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్ని భాషల్లో కలుపుకొని రూ.500 కోట్లు వసూలు చేయాలని హీరో మోహన్‌లాల్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.
News April 19, 2025
చిన్నస్వామిలో మారని RCB కథ!

IPL: PBKSపై ఓడిన RCB ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. హోంగ్రౌండ్‌లో 46 మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. గతంతో ఈ రికార్డ్ ఢిల్లీ పేరిట ఉండేది. ఆ జట్టు అరుణ్‌జైట్లీ స్టేడియంలో 45 మ్యాచులు ఓడింది. కాగా, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడం RCBకి తొలి నుంచీ మైనస్సే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో భారీ స్కోర్లు చేసినా డిఫెండ్ చేసుకోలేక చాలా మ్యాచ్‌లు ఓడిపోయిందని అంటున్నారు.
News April 19, 2025
మన ‘పాకాల’ నీరు.. సముద్రంలో కలుస్తోందిలా!

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు వరద నీరు 192 కి.మీ ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ‘పాకాల’ వాగు.. ప్రవాహ క్రమేణా ‘మున్నేరు’గా మారి ఏపీలోని కంచికచర్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా బంగాళాఖాతం సముద్రంలో కలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంత రైతులకు, ప్రజలకు పాకాల నీరు జలవనరుగా ఉంది.