News April 15, 2025

అమెరికాలో తిరుపతి జిల్లా యువకుడి మృతి

image

తిరుపతి జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో కన్నుమూశారు. వెంకటగిరి పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది బాబ్జి కుమారుడు రవితేజ(35) అమెరికా వెళ్లారు. అక్కడ ఫీడ్ ఎక్స్ కంపెనీలో వైర్లెస్ నెట్వర్క్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. మూడేళ్లక్రితం అమెరికాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. ఈక్రమంలో రవితేజ చనిపోయారని ఆయన తండ్రికి సమాచారం అందింది. ఎలా చనిపోయారనేది తెలియాల్సి ఉంది.

Similar News

News January 17, 2026

మళ్లీ సంక్రాంతికి వస్తాం!

image

భోగి నాడు మంటల వెలుగుల్లో బంధువులతో పంచుకున్న వెచ్చని మమతలు, సంక్రాంతి రోజు ఆరగించిన పిండి వంటల రుచులు, కనుమకు చేసిన సందడి జ్ఞాపకాలను మోసుకుంటూ జనం మళ్లీ పట్నం బాట పడుతున్నారు. సెలవులు ముగియడంతో చదువులు, వృత్తి, వ్యాపారం రీత్యా పట్టణాల్లో స్థిరపడిన వారు బిజీ జీవితంలోకి వచ్చేస్తున్నారు. అమ్మానాన్నలకు జాగ్రత్తలు చెప్పి, బంధువులు, స్నేహితులకు మళ్లొస్తామని హామీ ఇచ్చి సొంతూళ్లకు టాటా చెబుతున్నారు.

News January 17, 2026

గ్రేటర్ వరంగల్‌లో ఊహాగానాలకు బ్రేక్.. రిజర్వేషన్లు ఇవే!

image

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వార్డులకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలోని 260 వార్డులతో పాటు గ్రేటర్ WGL నగరపాలక సంస్థకు చెందిన 66 డివిజన్లకు రిజర్వేషన్లు చేసింది. ప్రస్తుతమున్న 66 డివిజన్లకు అదనంగా మరో 22 పెంచుతారన్న ఊహాగానాలకు చెక్ పెట్టింది. గ్రేటర్‌లోని 66 డివిజన్లలో ST-2, SC-11, BC-20, మహిళా(జనరల్)-17, అన్ రిజర్వ్-16 డివిజన్లను కేటాయించారు.

News January 17, 2026

నెల్లూరు: మీ పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం

image

నెల్లూరు జిల్లాలో సముద్ర తీరాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతు, సుడిగుండాలు తెలియకుండా నీటిలోకి దిగితే ప్రాణాపాయం తప్పదని సూచించారు. బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలని, పిల్లలను నీటి దగ్గర ఒంటరిగా వదలరాదని తెలిపారు. ఒక్క నిమిషం అజాగ్రత్త కుటుంబానికి జీవితకాల దుఃఖాన్ని మిగుల్చుతుందని హెచ్చరిస్తున్నారు.