News April 15, 2025
మహబూబ్ నగర్ జిల్లాలో.. ఒకే రోజు ఐదుగురి మృతి

MBNR జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో సోమవారం ఐదు మంది మృతి చెందారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద క్వారీ గుంతలో పడి విజయ్, సుశాంత్, మహమ్మద్ మృతి చెందగా.. బాలానగర్ మండలంలోని గంగాధర్‌పల్లిలో చేపల పేటకు వెళ్లి రాములును కాపాడబోయి యాదయ్య కూడా గల్లంతయ్యాడు. ఈ రెండు ఘటనలతో మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన ఐదుగురు నిరుపేద కుటుంబాలకు చెందినవారు.
Similar News
News September 16, 2025
కడప: మెగా DSC.. 32 పోస్టులు ఖాళీ

మెగా DSCకి సంబంధించి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి కడప జిల్లాలో 712 పోస్టులకు గాను 680 పోస్టులు భర్తీ అయినట్లు విద్యాశాఖ తెలిపింది. వివిధ కారణాల చేత మిగిలిన పోయిన 32 పోస్టులను వచ్చే DSCలో చేర్చనున్నారు. ఈ నెల 19న ఎంపికైన వారికి నియామకపత్రాలు అందిస్తారు. శిక్షణ తర్వాత పాఠశాలలు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.
News September 16, 2025
గౌరవెల్లి పెద్దగుట్టలో చిరుత కలకలం..!

అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ శివారుల్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జక్కుల రాజు అనే రైతు పొలం వద్దకు వెళ్తుండగా చిరుతను చూసినట్లు తెలిపాడు. పొదల్లో దాగున్న పులి గట్టిగా గర్జిస్తూ కొండెంగను చంపి పట్టుకుందన్నారు. గత వారం గుట్టపైకి వెళ్లిన లేగ దూడలను తిన్న కళేబరాలు కనిపించాయని చెప్పాడు. దాంతో పశువుల కాపరులు ఆ వైపు వెళ్లడానికి భయపడుతున్నారు.
News September 16, 2025
రేబిస్‌తో చిన్నారి మృతి

AP: గుంటూరు(D) పొన్నూరు (M) వెల్లటూరులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తాడిశెట్టి కార్తీక్(5) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గత నెల 22న కుక్కలు దాడి చేశాయి. గాయపడిన బాలుడిని పలు ఆస్పత్రుల్లో చూపించారు. 3రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం GNT ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు.