News April 15, 2025

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు బిగ్ షాక్?

image

TG: ఇంజినీరింగ్ విద్యార్థులకు బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫీజులపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఫీజులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా 52% నుంచి 84% ఫీజులు పెంచాలని ప్రభుత్వంపై కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి.

Similar News

News April 19, 2025

పాన్ ఇండియా లెవల్‌లో దృశ్యం-3

image

మలయాళం సినిమాలు దృశ్యం, దృశ్యం-2 అన్ని భాషల్లో రీమేక్ అయి మంచి విజయాలు అందుకున్నాయి. దృశ్యం-3 తెరకెక్కించే పనుల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ బిజీగా ఉండగా, ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దృశ్యం-3ని రీమేక్ చేయకుండా, పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్ని భాషల్లో కలుపుకొని రూ.500 కోట్లు వసూలు చేయాలని హీరో మోహన్‌లాల్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.

News April 19, 2025

చిన్నస్వామిలో మారని RCB కథ!

image

IPL: PBKSపై ఓడిన RCB ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. హోంగ్రౌండ్‌లో 46 మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. గతంతో ఈ రికార్డ్ ఢిల్లీ పేరిట ఉండేది. ఆ జట్టు అరుణ్‌జైట్లీ స్టేడియంలో 45 మ్యాచులు ఓడింది. కాగా, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడం RCBకి తొలి నుంచీ మైనస్సే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో భారీ స్కోర్లు చేసినా డిఫెండ్ చేసుకోలేక చాలా మ్యాచ్‌లు ఓడిపోయిందని అంటున్నారు.

News April 19, 2025

వేమన పద్యం

image

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసమునకు
తన్నులోను జూడ తమమెల్ల వీడును
విశ్వదాభిరామ వినుర వేమ.
భావం: ఉన్నచోటును విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూసుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది.

error: Content is protected !!