News April 15, 2025

HYD: అర్ధనగ్న నృత్యాలు.. 17 మంది యువతులు అరెస్ట్

image

HYDలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్‌లో రైడ్స్ చేశారు. సమయానికి మించి పబ్ నడపడం, యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లని ఆకట్టుకునేలా యువతులతో ఇలా చేయించడం గమనార్హం. ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మరీ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మొత్తం 17మంది యువతులు, పబ్ నిర్వాహకుడు, కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News October 18, 2025

HYD నుంచి శ్రీశైలానికి గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం

image

HYD నుంచి శ్రీశైలానికి 147 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రావిర్యాల నుంచి ఆమన్‌గల్, ఆమన్‌గల్ నుంచి మన్ననూరు వరకు దీనిని నిర్మించి, అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా HMDA నిర్మిస్తోన్న రావిర్యాల-ఆమన్‌గల్ కొత్త రోడ్డును దీనికి అనుసంధానించనున్నారు.

News October 18, 2025

HYD: నిజాంపేటలో చిట్టీల పేరుతో రూ.150 కోట్లు స్వాహా

image

చిట్టీల పేరుతో డబ్బులు స్వాహా చేసిన ఘటన HYD నిజాంపేట పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. నిజాంపేటలో రేష్మ, అలీ అనే దంపతులు క్లినిక్ నడుపుతున్నారు. దీంతో పాటు చిట్టీలు నిర్వహించేవారు. అయితే సుమారు 100 మంది నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసిన రేష్మ దంపతులు పరారయ్యారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు PSను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

News October 17, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఈరోజు 21 నామినేషన్లు

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఈరోజు 17 మంది 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేయగా 12 మంది వివిధ రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థుల నామినేషన్ దాఖలయ్యాయి. ఐదు రోజుల్లో ఇప్పటి వరకు మొత్తం 63 నామినేషన్లు వచ్చాయి.