News April 15, 2025

రజతోత్సవ సభతో వరంగల్‌లో BRS ఊపందుకోనుందా?

image

ఈనెల 27న WGL జిల్లాలో BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 BRS కైవసం చేసుకోగా.. ములుగు, BHPL కాంగ్రెస్ గెలిచింది. 2023లో అది కాస్తా తారుమారుగా జనగామ, స్టే.ఘ మాత్రమే BRS గెలిచి.. మిగతావన్నీ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు BHPL MLA కాంగ్రెస్ నుంచి BRSలో, ఇప్పుడు స్టే.ఘ MLA BRS నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సభతో జిల్లాలో మల్లీ BRS ఊపందుకోనుందా?

Similar News

News September 16, 2025

నేడు భారీ వర్షాలు

image

APలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలకు అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. అటు TGలో వరంగల్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని IMD తెలిపింది.

News September 16, 2025

అన్నమయ్య జిల్లా ఉద్యానవన పంటల విస్తరణపై CM దృష్టి

image

అమరావతిలో జరిగిన నాలుగవ కలెక్టర్ల సదస్సులో CBN అన్నమయ్య జిల్లాలో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని పెంచాలని సోమవారం కలెక్టర్‌కు సూచించారు. జిల్లాలో ఎక్కువగా వ్యవసాయాధారిత రైతులు ఉన్నారని, వర్షాభావం వల్ల సాగు తగ్గిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ CMకు తెలిపారు. ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రణాళికతో ముందడుగు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

News September 16, 2025

మెగా డీఎస్సీ: విజయవాడలో 5వేల మందికి బస

image

AP: మెగా DSCలో ఉద్యోగం సాధించిన నూతన టీచర్లకు ఈ నెల 19న CM చంద్రబాబు అమరావతిలో నియామక పత్రాలు అందించనున్నారు. దీని కోసం జోన్‌-1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఈ నెల 18 సాయంత్రానికి సుమారు 5వేల మంది విజయవాడ రానున్నారు. వారికి బస కోసం 13 పాఠశాలలను కేటాయించారు. అటు రాయలసీమలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గుంటూరులో ఏర్పాట్లు చేస్తున్నారు.