News April 15, 2025

MHBD: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

image

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటింటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లితండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూర ప్రాంతాలకు పంపవద్దని, బైకులు, ఫోన్ ఎక్కువగా వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, MHBD జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.

Similar News

News November 3, 2025

మూల మలుపు.. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణం?

image

మీర్జాగూడ ప్రమాదంపై రవాణా శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటు బస్సు, అటు టిప్పర్ రెండు ఓవర్ స్పీడ్‌తో వచ్చాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మూల మలుపు కూడా ఉందని, దీంతో రెండు వాహనాలు ఢీ కొట్టగానే కంకర మొత్తం ప్రయాణికుల మీదకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. కంకర కూడా ఓవర్ లోడ్ కావడంతో.. బరువు పెరిగి అదుపుతప్పినట్లు అంచనా వేస్తున్నారు.

జనగామ జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

image

జనగామ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పాలకుర్తిలో 2.8, జఫర్‌గఢ్ 3.8, కొడకండ్ల 8.2, తరిగొప్పుల 15.2, నర్మెట్ట 8.6, జనగామ 1.4, రఘునాథపల్లి 1.2, లింగలఘనపూర్ 1.0మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.