News April 15, 2025
నేడు విచారణకు రానున్న వంశీ బెయిల్ పిటిషన్

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. విజయవాడ SC, ST కోర్టు న్యాయ అధికారి హిమబిందు గత శుక్రవారం ఈ పిటిషన్ విచారించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా సత్యవర్ధన్ అనే యువకుడిని అపహరించిన కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విధితమే.
Similar News
News April 18, 2025
గుణదలలో షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు

కృష్ణాజిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు ఏప్రిల్ 21న గుణదలలో నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి గోగులమూడి విజయ్ కుమార్ తెలిపారు. ఈ పోటీలకు ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు. ఇక్కడ ఎంపికైన వారు మదనపల్లిలో ఈనెల 25, 26 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.
News April 18, 2025
కృష్ణా: విద్యార్థి మృతదేహం లభ్యం

ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామానికి చెందిన విద్యార్థి ప్రత్తిపాటి పవన్ సమిత్ (15) గురువారం సాయంత్రం కేఈబీ కెనాల్‌లో స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కెఈబీ కెనాల్ వెంబడి గాలింపు చర్యలు చేపట్టగా చల్లపల్లి మండలం వెలివోలు కుమ్మరిపాలెం వద్ద శుక్రవారం పవన్ మృతదేహం లభ్యమైనది. ఈ సంఘటనతో పాపవినాశనంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News April 18, 2025
బాపులపాడు: మార్కెట్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరి మృతి

బాపులపాడు మండలం వేలేరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేలేరు వద్ద కారు ఢీ కొనడంతో బైక్‌పై వెళ్తున్న బాబు అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇతను తేలప్రోలులో పట్టుగూళ్ల రీలింగ్ యూనిట్‌ని నిర్వహిస్తుంటాడు. పట్టుగూళ్ల కోసం హనుమాన్ జంక్షన్ మార్కెట్‌కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.