News April 15, 2025
సంగారెడ్డి: కాపురానికి రమ్మంటే రావడం లేదని హత్య

భార్యను భర్త హత్య చేసిన ఘటన పటాన్ చెరులో జరిగిన విషయం తెలిసిందే. వివరాలు.. జిన్నారం(M) కిష్టాయిపల్లికి చెందిన సురేశ్‌కు పటాన్ చెరు (M) పెద్ద కంజర్ల వాసి రమీలా(24)తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రమీలా తల్లి దగ్గరికి వెళ్లింది. కాపురానికి రమ్మంటే రావడం లేదని అత్తగారి ఇంటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవ పడి రోకలి బండతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది.
Similar News
News November 4, 2025
ఊట్కూర్ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌కు గ్రీన్ సిగ్నల్..!

ఊట్కూర్ రైల్వే స్టేషన్‌ను క్రాసింగ్ స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ మేరకు ఆయన దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో మంగళవారం భేటీ అయ్యారు. ఈ ప్రాజెక్టు అమలుతో మక్తల్, నారాయణపేట, వికారాబాద్ ప్రాంతాలతో పాటు 30 గ్రామాల ప్రజలకు లాభం చేకూరనుందని మంత్రి తెలిపారు. అప్‌గ్రేడ్‌పై జీఎం శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News November 4, 2025
122 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News November 4, 2025
మంత్రి అజహరుద్దీన్‌కు శాఖల కేటాయింపు

TG: ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజహరుద్దీన్‌కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలు (పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్), మైనారిటీ వెల్ఫేర్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఆయనకు హోంశాఖ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ శాఖను సీఎం రేవంత్ అజహరుద్దీన్‌కు ఇవ్వలేదు.


