News March 27, 2024

రన్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు

image

కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వేపై రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఇండిగో విమానాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్లేన్ ఢీకొట్టింది. దీంతో రెండు విమానాల ఒకవైపు రెక్కలు విరిగిపోయాయి. వందలాది మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. రెండు విమానాల పైలట్లను DGCA విచారిస్తోంది.

Similar News

News October 4, 2024

మరింత పెరిగిన జుకర్‌బర్గ్ సంపాదన

image

మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మరింత సంపన్నులయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌($205 బిలియన్లు)ను అధిగమించి ప్రపంచంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. జుకర్‌బర్గ్ నికర విలువ $206.2 బిలియన్లకు పెరిగింది. కాగా, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ $256.2 బిలియన్లతో ప్రపంచ కుబేరుడి స్థానాన్ని నిలుపుకున్నారు. ఫ్రెంచ్ బిజినెస్‌మెన్ బెర్నార్డ్ అర్నాల్ట్ $193 బిలియన్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.

News October 4, 2024

నందిగం సురేశ్‌కు బెయిల్

image

AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

News October 4, 2024

తిరుమల లడ్డూ వ్యవహారం.. సుప్రీం కీలక ఆదేశాలు

image

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఐదుగురు సభ్యులతో SIT ఏర్పాటు చేసి అందులో CBI నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒక నిపుణుడిని ఉంచాలని సూచించింది. CBI డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణకు ఆదేశించింది. ఈ లడ్డూ వ్యవహారం పొలిటికల్ డ్రామాగా మారాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది.