News March 27, 2024
మ్యాచ్‌కు సిద్ధం: కమిన్స్

కోల్‌కతాతో తొలి మ్యాచ్‌లో త్రుటిలో గెలుపును చేజార్చుకొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై బోణీ చేయాలన్న కసితో ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ‘రెండో మ్యాచ్‌కు సిద్ధం’ అంటూ ఇన్‌స్టా పోస్ట్ పెట్టారు. ముంబై, హైదరాబాద్ జట్లు ఈ సీజన్‌లో తొలి విజయం కోసం పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయి.
Similar News
News January 17, 2026
తల్లి దగ్గరకు వెళ్లగానే పిల్లలు ఏడుపు మానేసేది ఇందుకే!

నవజాత శిశువులకు వాసనను గుర్తించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తల్లి పాలలో ఉండే ప్రత్యేకమైన సువాసనను వారు ఇట్టే పసిగట్టగలరు. అందుకే ఆకలి వేసినప్పుడు శిశువు తన తలని తల్లి వైపు తిప్పుతుంటారని ఇందులో తెలిసింది. అలాగే శిశువులు వారి తల్లి డ్రెస్ వాసనను బట్టి ఏడుపు ఆపివేస్తారని మరో పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని మీరెప్పుడైనా గమనించారా? COMMENT
News January 17, 2026
ICMR-NIIRNCDలో ఉద్యోగాలు

<
News January 17, 2026
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమ: CM

AP: చరిత్ర తిరగరాయడంలో తెలుగువాళ్లు ముందున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. కాకినాడలో AM గ్రీన్ అమోనియా పరిశ్రమకు శంకుస్థాపన అనంతరం సీఎం మాట్లాడారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమ ఇది. 2027 జూన్ నాటికి మొదటి ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఏడాది క్రితం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. కాకినాడ నుంచి విదేశాలకు గ్రీన్ అమోనియా ఎగుమతి చేస్తాం’ అని పేర్కొన్నారు.


