News April 15, 2025
రెండో రోజూ స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు!

బంగారం ధరలు వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.350 తగ్గి రూ.87,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 330 తగ్గి రూ.95,180 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర రూ. 100 తగ్గి రూ.1,09,800గా ఉంది.
Similar News
News September 16, 2025
HYD మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్లు

TG: హైదరాబాద్‌లోని మెట్రో రైళ్లలో ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 20 మంది హిజ్రాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేశారు. గార్డుల నియామకాల కోసం 400 మంది దరఖాస్తు చేసుకోగా నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసినట్లు వివరించారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.
News September 16, 2025
నోటిఫికేషన్ విడుదల చేసిన APPSC

AP: రాష్ట్రంలో 21 ఉద్యోగాలకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లైబ్రేరియన్ సైన్స్‌లో జూనియర్ లెక్చరర్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్)- 12+1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)- 3, హార్టికల్చర్ ఆఫీసర్- 2 పోస్టులు ఉన్నాయి. రేపటి నుంచి అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని APPSC తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News September 16, 2025
అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ ఇన్‌వెస్టిగేషన్ యూనిట్‌కి పోలీస్ స్టేషన్ హోదా లేదని 11 FIRలను హైకోర్టు కొట్టివేయగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులపై విచారణకు, ఛార్జ్‌షీట్‌ల దాఖలుకు అనుమతినిచ్చింది.