News April 15, 2025
మంచిర్యాల జిల్లాలో “హీటెక్కిన” రాజకీయం

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌లో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు ‘గడ్డంబ్రదర్స్’ను ఉద్దేశిస్తూ పార్టీకి ఇచ్చిన వార్నింగ్ జిల్లాలో కాక రేపుతోంది. దీనికి దీటుగా ఎమ్మెల్యేలు వినోద్, వివేక్.. ప్రేమ్‌సాగర్‌రావుపై కౌంటర్ అటాక్ చేయడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ కయ్యాలపై మీరేమంటారు?
Similar News
News November 14, 2025
APPLY NOW: నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 పోస్టులు

నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులైన, 15 నుంచి 24 ఏళ్లు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.100. ST, SC, దివ్యాంగులకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://ner.indianrailways.gov.in/
News November 14, 2025
వణుకుతోన్న హైదరాబాద్.. సింగిల్ డిజిట్ నమోదు

చలికి హైదరాబాద్ మహానగరం గజగజ వణుకుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. నేడు అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 8.8°C నమోదైంది. రాజేంద్రనగర్‌లో 10.7, BHELలో 11.1, బొల్లారం, మారేడుపల్లి, గచ్చిబౌలిలో 11.7, కుత్బుల్లాపూర్‌లో 12.2, జీడిమెట్లలో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 3-4 రోజులూ ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.
News November 14, 2025
NLG: యాసంగి ప్రణాళిక@6,57,229 ఎకరాలు

యాసంగి సాగు ప్రణాళికను NLG జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. గత యాసంగి సీజన్ లో వరి, ఇతర పంటలు కలిపి 6,49,712 ఎకరాల్లో రైతులు సాగు చేయగా.. ప్రస్తుత యాసంగి సీజన్‌లో 6,57,229 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలను రూపొందించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు.


